![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -749 లో ఇందిరాదేవి, కనకం, అపర్ణ ముగ్గురు కలిసి పెళ్లి ఆపాలనుకుంటారు. ఈ ప్రయత్నంలో భాగంగా పంతులిని బ్లాక్ మెయిల్ చేస్తారు. యామిని పూజ చేసి హారతి ఇస్తుంది. హారతి గాలికి పోవాలని కనకం ఫ్యాన్ అటుగా తిప్పుతుంది. దాంతో ఆ దీపం ఆగిపోతుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఇన్ని జరుగుతున్నాయి. పెళ్లి ఆపండి అని ఇందిరాదేవి అంటుంది. అవసరం లేదని పంతులు యామినికి ఫేవర్ గా మాట్లాడతాడు. పంతులు ఫోన్ మాట్లాడుతుంటే.. యామిని వింటుంది. ఎవరు నిన్ను పెళ్లి ఆపమని అంటుందని అడుగుతుంది. దాంతో పంతులు జరిగింది యామినికి చెప్తాడు.
నువ్వు ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరపాలి.. లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదని యామిని పంతులిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ మాటలు పంతులు గుర్తు చేసుకొని యామినికి సపోర్ట్ చేస్తాడు. యామినికి పంతులు సపోర్ట్ చెయ్యడంతో ఇందిరాదేవి వాళ్ళు షాక్ అవుతారు. ఇక నిశ్చితార్థం, పెళ్లి ఒకేసారి అని పంతులు చెప్తాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి యామిని వచ్చి.. అసలు ఎన్ని ప్లాన్ చేస్తన్నావ్.. ఈ పెళ్లి ఆపడానికి అని యామిని అంటుంది. నేనేం చెయ్యడం లేదు.. నేను పెళ్లి ఆపను కానీ పెళ్లి జరగదు.. మా ఆయనకి చివరి నిమిషంలో నేను గుర్తొచ్చినా ఈ పెళ్లి జరగదని కావ్య కాన్ఫిడెన్స్ గా చెప్తుంది.
ఆ తర్వాత అపర్ణ, కనకం, ఇందిరాదేవి డిస్సపాయింట్ అవుతారు. నేను వెళ్లి అల్లుడు గారితోనే మాట్లాడుతానని రాజ్ దగ్గరికి కనకం వెళ్తుంది. అల్లుడు గారు నేను కళావతి అమ్మని.. నా కూతురు మిమ్మల్ని ప్రేమించింది.. మీరు ఎలా ఇలా వేరొక పెళ్లి చేసుకుంటున్నారని అడుగుతుంది. నాకు వేరే ఆప్షన్ లేదని రాజ్ అనగానే ఇన్ని శకునాలు అయినవి ఇక పెళ్లి ఆపండి అని కనకం అంటుంది. తరువాయి భాగంలో రాజ్, యామిని ఎంగేజ్ మెంట్ ల రింగ్ ని కనకం తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |